ఒరిజినల్ ఇస్తే: కౌంటర్ దాఖలుపై సబిత, ధర్మాన మెలిక

తాము రాజీనామా ఎందుకు చేశామో ప్రజలకు చెప్పేందుకే మీడియాతో మాట్లాడామని వారు చెప్పారు. ఈ సందర్భంగా తాము వీడియోలను యూ ట్యూబ్ నుండి తీసుకున్నామని సిబిఐ తరఫు న్యాయవాదులు చెప్పారు. దానికి సబిత, ధర్మాన తరఫు న్యాయవాదులు యూట్యూప్ వీడియోలు ప్రామాణికం కాదని చెప్పారు. అనంతరం కోర్టు దీనిని ఈ నెల 25వ తేదికి వాయిదా వేసింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటుండటంతో సబిత, ధర్మానలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సిబిఐ ఛార్జీషీటులో వారి పేర్లను చేర్చడంతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం సూచనల మేరకు వారు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషులుగా నిరూపించుకుంటామని చెప్పారు.
మరోవైపు సబిత, ధర్మానలను తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఇటీవల మెమో దాఖలు చేసింది. అదే సమయంలో వారు సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశముందని మెమోలో సిబిఐ అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. అయితే ధర్మాన, సబితలు మాత్రం తమకు ఒరిజినల్ సిడిలు ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.
విజయ సాయి రెడ్డి జైలు మార్పు మెమో 24కు వాయిదా
జగన్ ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న విజయ సాయి రెడ్డిని మరో జైలుకు మార్చాలన్న సిబిఐ పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 24వ తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications