ప్యాకేజి తీసుకోండి: సీమాంధ్ర మంత్రులు, ఢిల్లీకి డిసిఎం

తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే తాము స్వాగతిస్తామని మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. అదే సమయంలో వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి కూడా ప్యాకేజీ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో ఏం చేయాలనే అంశంపై సీమాంధ్ర నేతల భేటీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్యాకేజీ తీసుకొండి: హర్ష కుమార్
తెలంగాణ ప్రాంతం వెనుకబడిందన్న తెలంగాణ రాజకీయ నాయకులు ప్రత్యేక ప్యాకేజీని తీసుకొని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ సూచించారు. ఆంధ్రా నేతలు దోపిడీ చేశారన్న తెలంగాణ ప్రాంత నేతలు అవేమిటో గణాంకాలతో సహా బయట పెట్టాలన్నారు.
ఢిల్లీ బాటలో మంత్రులు
తెలంగాణకు భారీ ప్యాకేజి ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో మంత్రులు ఢిల్లీ బాట పడుతున్నారు. ఇప్పటికే శాసన మండలి సభ్యుడు డి.శ్రీనివాస్, గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఢిల్లీ వెళ్లారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి కూడా వెళ్లే అవకాశాలున్నాయి. మరికొందరు తెలంగాణ మంత్రులు కూడా వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications