ప్యాకేజీ ఎఫెక్ట్: తేల్చాలని దానం, లాభంలేదని డికె అరుణ

ప్యాకేజీలతో ఎలాంటి లాభం లేదని మరో మంత్రి డికె అరుణ అన్నారు. తెలంగాణ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ మనుగడ సాధించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్నారు. తెలంగాణతో పాటు ప్యాకేజీకు కూడా ఇవ్వాలని మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి ముఖేష్ గౌడ్ సూచించారు. ప్యాకేజీతలతో ఎవరు సంతృప్తి చెందరని మంత్రి సునీత లక్ష్మా రెడ్డి అన్నారు. తెలంగాణకు ప్యాకేజీలు అనే వాదన వినిపిస్తున్నందున మంత్రులు స్పందించారు.
వాయిదా తీర్మానాలు తిరస్కరించిన సభాపతి
ఈ రోజు ఉదయం సభ ప్రారంభమైన తర్వాత వివిధ పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై టిడిపి, తెలంగాణ తీర్మానంపై టిఆర్ఎస్, ఐఎన్‌జి భారత్‌కు భూకేటాయింపులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, విద్యాశాఖలో దినసరి వేతన ఉద్యోగుల సమస్యలపై సిపిఎం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదాపై సిపిఐ వాయిదా తీర్మానం ఇచ్చాయి. వాటిని స్పీకర్ తిరస్కరించారు.
దీంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభాపతి సభను అరగంట వాయిదా వేశారు. సభ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యంపై టిడిపి గన్ పార్కు వద్ద నిరసన చేపట్టింది.












Click it and Unblock the Notifications