వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ బిజెపి బంద్ హింసాత్మకం, నేడే నితీష్ 'విశ్వాసం'

By Srinivas
|
Google Oneindia TeluguNews

BJP and JD(U) supporters clash in Patna during Bandh
పాట్నా: జెడి(యు) తీరును నిరసిస్తూ బిజెపి పిలుపు మేరకు మంగళవారం జరిగిన బంద్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రంలో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బిజెపి, జెడి(యు) పార్టీ రాష్ట్ర కార్యాలయాలు ఉన్న పాట్నాలోని వీరచంద్ పటేల్ మార్గంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మరికొన్ని ఇతర ప్రాంతాల్లోను హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

బిజెపి అగ్రనేతలు సుశీల్ కుమార్ మోడీ, రవిశంకర్రపసాద్, సిపి ఠాకూర్ సహా 3,227 మంది అరెస్టయ్యారు. కార్యకర్తలు కర్రలతో కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. కొందరికి తలలు పగిలాయి. ప్రభుత్వ వాహనాలను బిజెపి కార్యకర్తలు ధ్వంసం చేశారు. జెడి(యు) రాష్ట్ర అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ నేతృత్వంలో పలువురు కార్యకర్తలు తమ కార్యాలయం వైపు వస్తుండగా బిజెపి కార్యకర్తలు అడ్డుచెప్పడంతో ఘర్షణ మొదలైంది.

ఘర్షణలో గాయపడిన రంజన్‌ను పాట్నా వైద్యకళాశాల ఆస్పత్రిలో ఐసియులో చేర్చారు. బిజెపి బంద్‌ను విశ్వాసఘాత దినంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభివర్ణించారు. రాజకీయాలకు రాజకీయాలతోనే సమాధానమిస్తామన్నారు.1974 నాటి జెపి ఉద్యమం తర్వాత తొలిసారిగా వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసి ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ తెలిపారు.

బంద్‌ను విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి తన పార్టీ కార్యక ర్తలను రెచ్చగొట్టి పంపారని బీహార్ బిజెపి అధ్యక్షుడు మంగళ్‌పాండే ఆరోపించారు. 32వ నెంబరు జాతీయ రహదారిని నిరసనకారులు నిర్బంధించారు.

ముందే విశ్వాసం

బిజెపితో మైత్రీబంధాన్ని తెంచుకున్న నితీశ్ కుమార్ బుధవారం విశ్వాసపరీక్షను ఎదుర్కోబోతున్నారు. 243 మంది సభ్యులున్న శాసనసభలో జెడి(యు)కు 118, బిజెపి-91, ఆర్జెడి-22, కాంగ్రెస్-4, ఎల్‌జెపి, సిపిఐలకు ఒక్కొక్కరు, ఆరుగురు స్వతంత్ర సభ్యులు ఉన్నారు. మేజిక్ సంఖ్య 122 కావాలంటే పాలకపక్షానికి ఇంకా నలుగురు సభ్యుల మద్దతు అవసరం. స్వతంత్రులలో ఐదుగురు ఇప్పటికే మద్దతు తెలిపేందుకు ముందుకొచ్చారు. దీంతో సర్కారుకు ఢోకా లేనట్లే.

English summary

 Nearly 6 people were injured in clashes between the supporters of BJP and JD(U) in Patna, as the BJP enforced a day-long shutdown in the state to protest JD(U)'s 'betrayal'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X