వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదల్లో యడ్డీ సన్నిహితురాలు, 'మాజీ' భార్య సరెండర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shobha karandlaje
బెంగళూరు/డెహ్రాడూన్/రాంచీ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సన్నిహితురాలు, మాజీ మంత్రి శోభా కరంద్లాజే ఉత్తరాఖండ్‌లోని వరదల్లో చిక్కుకుపోయారు. చార్ ధామ్ యాత్రకు వెళ్లిన ఆమె జల ప్రళయంలో చిక్కుకుపోయి ఓ మారుమూల గ్రామంలో తల దాచుకున్నారు.

విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ఆమెతో ఫోన్లో మాట్లాడారు. సురక్షితంగా ఉండాలని, ఎటువంటి సాయం అందించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. వరద ప్రభావం తగ్గిన తర్వాతే వెనుతిరిగి రావాలని సూచించారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ మంత్రి భార్య

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ మాజీ మంత్రి అనోష్ ఎక్కా భార్య మెమన్ ఎక్కా మంగళవారం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయారు. కోర్టు ఆమెను 14 రోజుల జ్యూడిషియల్ రిమాండుకు తరలించింది. అవినీతి ఆరోపణలతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయడంతో పది నెలలుగా అజ్ఞాతంలో ఉన్న మెమన్ ఇప్పుడు లొంగిపోయారు.

2006 నుంచి 2009 మధ్య కాలంలో మధుకొడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కా మంత్రిగా ఉన్నారు. అప్పుడు రూ.17 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ నమోదు చేసిన అభియోగపత్రంలో మెమన్ పైన అభియోగాలు మోపింది. మాజీ మంత్రి ఎక్కాపై అక్రమాస్తుల కేసుతో పాటు మనీలాండరింగ్ అభియోగాలు ఉన్నాయి. అతను నాలుగేళ్ల క్రితం అరెస్టై ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు.

English summary
Former minister and KJP leader ShobhaKarandlaje is among the pilgrims stranded in the hilly state of Uttarakhand by flash floods and landslides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X