సోనియా తల్చుకుంటే..: జానా, సంతకానికి ఎమ్మెల్సీ నో

కాంగ్రెసు పార్టీకి తెలంగాణ ఇచ్చిన ఖ్యాతిని దక్కిస్తామని అన్నారు. అదే తమ తాపత్రయమని చెప్పారు. మండల వ్యవస్థను అందరూ వ్యతిరేకించినా స్వర్గీయ నందమూరి తారక రామారావు తలుచుకుంటే ఏర్పాటయిందన్నారు. ఇప్పుడు మండల వ్యవస్థను అందరూ ఆస్వాదిస్తున్నారని చెప్పారు. అలాగే తెలంగాణను ఎందరు వ్యతిరేకించినా సోనియా గాంధీ తలుచుకుంటే సాధ్యమేనని అన్నారు. పాలనా సౌలభ్యానికి చిన్న రాష్ట్రాలు అవసరమన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెసు నేతల సంతకాలు తీసుకుంటున్నామని చెప్పారు. సంతకాలు పెట్టని వారి పేర్లను ఈ నెల 30వ తేదిన జరిగే నిజాం కళాశాల సభలో ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు ఉందని, ఇప్పుడు తెలంగాణలోనే మూడున్నర కోట్లు ఉందన్నారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెసు ప్రతిష్టను పెంచుకోవాలని ఆయన అన్నారు. ఇప్పుడు చిన్న రాష్ట్రాలను వ్యతిరేకిస్తున్న వారు భవిష్యత్తులో సమర్థిస్తారన్నారు.
రంగారెడ్డి నో
తెలంగాణపై అధిష్టానానికి పంపే తీర్మానంపై సంతకం పెట్టాలని జానా రెడ్డి సీనియర్ నేత, ఎమ్మెల్సీ రంగారెడ్డిని కోరారు. సంతకం ఎందుకో తనకు తెలుసునన్న రంగారెడ్డి.. తాను సంతకం చేయనని చెప్పారు.
మడమ తిప్పం: హరీష్
తెలంగాణ విషయంలో తాము మడమ తిప్పేది లేదని తెరాస సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణకు టిడిపి వెన్నుపోటి పొడిచిందని, చంద్రబాబు యూ టర్న్ వల్లే తెలంగాణ ఆగిపోయిందన్నారు. చంద్రబాబు సిబిఐ విచారణకు సిద్ధపడితే కెసిఆర్ కూడా సిద్ధమన్నారు. ప్యాకేజీలు కాలం చెల్లిన మందులాంటివన్నారు.












Click it and Unblock the Notifications