ఆహ్వానిస్తే తెలంగాణ సభకు వెళ్తా, తప్పేం కాదు: బొత్స

Botsa Satyanrayana
హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణ నేతలు తలపెట్టిన బహిరంగ సభకు ఆహ్వానిస్తే తాను వెళ్తానని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. వారి అభిప్రాయాలను తెలంగాణ కాంగ్రెసు నేతలు బహిరంగ సభ ద్వారా పార్టీ పరిధికి లోబడి ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. బుధవారం రాత్రి ఆయన తన ఛేంబర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రాష్ట్ర పరిస్థితులపై తమ పార్టీ అధిష్ఠానం అధ్యయనం చేస్తోందని, త్వరలోనే అన్ని సమస్యలకూ పరిష్కారం చూపుతుందని ఆయన అన్నారు. 'బంగారు తల్లి' ఒక మంచి పథకమని అన్నారు. గతంలో ఈ పథకాన్ని కూడా తాను వ్యతిరేకించలేదని, తన అభిప్రాయాలను మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు.

తెలంగాణ కాంగ్రెసు నేతల సమావేశంతో తనకు సంబంధం లేదని చెప్పారు. ప్యాకేజీలంటూ పత్రికల్లో వచ్చిన ఊహాగానాలపై స్పందించబోనని చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని, దీనిపై త్వరితగతిన నిర్ణయం వస్తుందని భావిస్తున్నానని చెప్పారు.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన దిగ్విజయ్ సింగ్‌తో మాట్లాడానని, నెలాఖరుకు ఆయన రాష్ట్రానికి రావచ్చుననని ఆయన అన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే జరుగుతుందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+