జగన్, విజయ సాయి కలిసుంటే తారుమారు: సిబిఐ

ఈ సమయంలో ఇరువైపుల న్యాయవాదులు వాదనలు వినిపించారు. జగన్, సాయిలు కలిసుంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ పునరుద్ఘాటించింది. సిబిఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ మాట్లాడుతూ.. 'ఒకే జైలులో ఉండటం వల్ల నిందితులిద్దరు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కనుక సాయిరెడ్డిని మరో జైలుకు మార్చాలి' అన్నారు. వీరిద్దరిని కలిసేందుకు పలుకుబటి ఉన్న వ్యక్తులు జైలుకు వస్తుంటారని, వారి ద్వారా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందన్నారు.
ఇద్దరిని ఒకే గదిలో ఉంచుతున్నారా? జడ్జి ప్రశ్నిస్తే... ఒకే ఆవరణలో ఉంచుతున్నారని సిబిఐ లాయర్ చెప్పారు. వేర్వేరు గదుల్లో ఉంచుతున్నామని జైలు ఎస్కార్ట్ సిబ్బంది చెప్పారు. అండర్ ట్రయల్ ఖైదీలను ఎక్కడ ఉంచాలన్నది జైలు అధికారులు నిర్ణయించుకొనే అంశమని, అందులో సిబిఐ మాట్లాడేందుకు వీలులేదని డిఫెన్స్ తరపున సీనియర్ న్యాయవాది సుశీల్ కుమార్ పేర్కొన్నారు.
తన క్లయింట్‌ను మరో జైలుకు మారిస్తే, న్యాయ సహాయం విషయంలో నిందితుడి హక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. ఒక పొలిటికల్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయంపై మాట్లాడిన తర్వాత, అదే విషయంపై సిబిఐ మెమో వేయడం విడ్డూరంగా ఉందన్నారు. సాక్ష్యాలు తారుమారు చేస్తారనేందుకు సిబిఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications