అధికారం కోసం నా హత్యకి సిపిఎం కుట్ర: మమతాబెనర్జీ

తన కొనగోటినైనా ఎవరు తాకలేరని ఘాటుగా స్పందించారు. సోమవారమే కమ్దునిలో తన హత్యకు పథకం వేసిన సమాచారం నిఘా సంస్థల వద్ద ఉందని చెప్పారు. ఆ గ్రామ యువతిపై అత్యాచార ఘటనపై అక్కడి మహిళలను సిపిఎం తన పైకి ఉసిగొల్పిందని మండిపడ్డారు.
ఆ సమయంలో తన చుట్టు పోలీసులు చేరకుండా తనను దిగ్భందించాలని ఓ జర్నిలిస్టు సిపిఎం కార్యకర్తలను ఉసిగొల్పాడని ఆరోపించారు. ఈ కుట్ర గురించి భద్రతాధికారులు తనకు తర్వాత చెప్పారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తనను భయపెట్టలేరన్నారు.
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఎం... మావోయిస్టులు, బిజెపి, కాంగ్రెసులతో కలిసి కుట్రలు పన్నుతోందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా సిపిఎం తిరిగి అధికారంలోకి రావడం కల్ల అన్నారు. ఇలాంటి కుట్రలను ప్రజలు ఘాటుగా తిప్పి కొట్టాలని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
అత్యాచారాలపై బిజెపి, సిపిఎం, కాంగ్రెసులు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతీకార రాజకీయాల్లో తనకు నమ్మకం లేదని, తాను ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తానని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క నెత్తుటి బొట్టు కూడా చిందలేదన్నారు. ఆమె రాష్ట్ర పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ప్రారంభించిన సందర్భంలో పై వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications