తెలంగాణ: సంతకానికి నో, సీమాంధ్ర నేతల్లో ఆందోళన

తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే రాయలసీమ ప్రాంతానికి కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్యాకేజీ కాకుండా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం వచ్చే నెలలో పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరితో కలిసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. విభజన అనివార్యమైతే రాయల తెలంగాణకు అనుకూలమని ఏరాసు వంటి మంత్రులు చెప్పినట్లుగా తెలుస్తోంది.
పాల్వాయికి జానారెడ్డి ఫోన్
రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కలిసి అపాయింటుమెంట్ తీసుకోవాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి శుక్రవారం ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణపై దిగ్విజయ్‌తో చర్చించేందుకు తెలంగాణ ప్రాంత నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు త్వరలో ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి.
సంతకం చేయని విష్ణు, జగ్గారెడ్డి
కాంగ్రెసు పార్టీ ఇచ్చిన మాట మేరకు తెలంగాణకు కట్టుబడి ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయాలని అ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు తీర్మానం చేసి సంతకాలు సేకరించారు. దీనిని అధిష్టానానికి పంపేందుకు సిద్ధమయ్యారు. ఈ తీర్మాన కాపీపై దామోదర రెడ్డి, జగ్గారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు సంతకాలు చేయలేదు.












Click it and Unblock the Notifications