కెటిఆర్ బతిమాలారు: టిడిపి, టిఆర్ఎస్ ఉల్లంఘన నోటీస్

సభాపతి వ్యవహార శైలి సరిగాలేదని అన్నారు. సభను నడపడంలో ఆయన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అధికార కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యాయన్నారు. లక్ష కోట్లు దోచుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారికి సభలో కూర్చునే నైతిక అర్హత ఉందా అని ప్రశ్నించారు.
తనపై సెటిల్మెంట్ ఆరోపణలు రావడంతో దానిపై సభలో చర్చకు రాకుండా కెటిఆర్ ముఖ్యమంత్రిని బతిమాలుకున్నారని అన్నారు. అవసరమైనప్పుడు తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులను సస్పెండ్ చేయడం లేదా వాయిదా వేయడం చేశారన్నారు. సస్పెండ్ లేదా వాయిదా ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.
హరీష్! రెహ్మాన్‌తో కేసు వేయించలేదా: టిడిపి
తెరాస సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు ల్యాంకో హిల్స్ పైన కేసు వేయలేదనటం అవాస్తవమని టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ల్యాంకో హిల్స్ పైన రెహ్మాన్‌తో కేసు వేయించారని, పద్మాలయ స్టూడియో విషయంలో హరీష్ ఎంత వసూలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ నటించి రాజకీయాల్లోకి వస్తే..: గండ్ర
స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించి రాజకీయాల్లోకి వస్తే, తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం రాజకీయాల్లోనే నటిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల వల్లే సభను సమర్థవంతంగా నడపలేకపోయామన్నారు.
టిడిపిపై టిఆర్ఎస్ సభా హక్కుల నోటీసు
కెటిఆర్ పైన వాయిదా తీర్మానం ఇచ్చిన టిడిపి పైన టిఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శి సదారాంను కలిసిన ఈటెల రాజేందర్, హరీష్ రావు, కెటిఆర్‌లు ఈ నోటీసును ఇచ్చారు. నాకు నోటీసు ఇవ్వకుండా వాయిదా తీర్మాణం ఎలా ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. నా పరువుకు నష్టం వాటిల్లింది, అందుకే సభా హక్కుల నోటీసు ఇచ్చామని కేటీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications