దగ్గుబాటి బ్లాక్‌మెయిల్, పొరపాటంటే ఏంటి?: టిఎస్సార్

Daggubati Venkateswara Rao - T Subbirami Reddy
విశాఖపట్నం: కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనను దుర్భాషలాడటమే కాకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి శుక్రవారం విశాఖలో అన్నారు. తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకునేందుగు ఆయనకు ఇచ్చిన గడువు ముగిసిందన్నారు. తాను తన న్యాయవాదితో మాట్లాడుతున్నానని, కేసు వేసేందుకు సిద్ధమవుతున్నానన్నారు.

దగ్గుబాటి తాను పొరపాటున మాట్లాడానని చెబితే ఏమిటని ప్రశ్నించారు. దగ్గుబాటికి తాను ఇప్పటికే లీగల్ నోటీసులను పంపించానని చెప్పారు. ఇప్పటికైనా ఆయన క్షమాపణలు చెప్పాలని సూచించారు. లేదంటే తాను ఎట్టి పరిస్థితుల్లో ఆయన పైన రూ.5 కోట్ల క్రిమినల్ దావా వేస్తానని హెచ్చరించారు.

కాగా విశాఖ లోకసభ సీటుపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు, టి.సుబ్బిరామి రెడ్డిల మధ్య వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దగ్గుబాటి టిఎస్సార్ పైన తీవ్ర విమర్శలు చేశారు. దానికి సుబ్బిరామి రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. తనకు క్షమాపణలు చెప్పాలని లేదంటే కేసు వేస్తానని హెచ్చరించారు. ఈ వివాదం వారి మధ్య కొనసాగుతోంది.

ఇద్దరి మధ్య వివాదం గురించి ఇటీవల దగ్గుబాటి మాట్లాడుతూ.. తనతో పెట్టుకుంటే రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డికే నష్టమని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు మంగళవారం హెచ్చరించారు. ఆయన పంపిన లీగల్ నోటీసుల అంశం తాను కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. తనను రెచ్చగొట్టవద్దని, అదే చేస్తే చాలా విషయాలు బయట పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ ఇద్దరి వివాదం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని దగ్గుబాటి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+