నెల జీతమిస్తున్నా, ఆదుకోండి: ఫ్యాన్స్‌కు చిరంజీవి

ఉత్తరాఖండ్ యాత్ర విషాదం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల సహాయక చర్యల్లో కొంత ఇబ్బంది కలుగుతోందని, బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వరదల్లో చిక్కుకున్న వారు ఎంతమందనేది స్పష్టమైన సమాచారం అందడం లేదన్నారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కృషి చేస్తున్నారన్నారు.
ఛారిటబుల్ ట్రస్ట్‌కు విరాళాలు ఇవ్వదల్చిన అభిమానులకు త్వరలోనే తేదీ ఖరారు చేస్తామన్నారు. బాధితులను ఆదుకోవాలని అభిమానులకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. తాను నెల జీతాన్ని ఇస్తున్నానని, తన శాఖకు చెందిన అధికారులు ఒకరోజు వేతనం ఇస్తారని చెప్పారు. వరద ప్రాంతాల్లో ముమ్మర చర్యలు చేపడుతున్నారన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాఖండ్‌కు మంత్రుల బృందాన్ని పంపించామని బొత్స సత్యనారాయణ చెప్పారు. బాధితులకు తగిన వసతి కల్పించమని ఆదేశించినట్లు చెప్పారు.
వర్షంతో సహాయక చర్చలకు ఆటంకం
కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుండి భారీగా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా హెలికాప్టర్‌తో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. ఆర్మీ సిబ్బంది మాత్రం అనిశ్చితి పరిస్థితుల్లోను సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆర్మీ డెబ్బై వేల మందిని రక్షించింది. పరిస్థితులు అనుకూలించాక హెలికాప్టర్లను పంపిస్తామని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications