అలీని రమ్మనలేదు, ప్రచారమే: టిడిపి మురళీ మోహన్

కాగా ఇటీవల అలీ తెలుగుదేశం, లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని వారం క్రితం అలీ కొట్టి పారేశారు. అలీ రాజకీయ ఆరంగేట్రంపై పెదవి ఇటీవల మాట్లాడారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని అలీ స్పష్టం చేశారు. గతంలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఇలా ప్రచారం జరగడంతో ఆయన కూడా తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, రాజకీయాల్లోకి రానని చెప్పారు.
వచ్చే ఎన్నికలలో ఆయనను రాజమండ్రి బరిలో దించేందుకు ఇటు వైయస్సార్ కాంగ్రెసు అటు తెలుగుదేశం పార్టీలో పోటీ పోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయనే వార్తలు ఇటీవలి వరకు వచ్చాయి. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే మురళీ మోహన్ ఖరారయ్యారు. కాంగ్రెసు పార్టీ నుండి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన ఒప్పుకుంటే జయప్రద బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. జయప్రద రాజమండ్రి ప్రాంతానికి చెందిన వ్యక్తి. అలీ కూడా ఇదే ప్రాంతానికి చెందినవాడు. అలీని తమ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగితే తమకు పార్లమెంటు స్థాయిలో లాభిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు భావించాయని, మురళీ మోహన్ ఇప్పటికే అలీతోని మాట్లాడినట్లుగా ప్రచారం జరిగింది. రాజకీయ ఆరంగేట్ర వార్తలను అలీ, తాను అతనితో మాట్లాడినట్లుగా వచ్చిన వార్తల్ని మురళీ మోహన్ కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications