కెసిఆర్ నిజాం, కెటిఆర్ రజ్వీ: రేవంత్, మజ్లిస్‌పై బిజెపి

Revanth Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిజాం నవాబులా, ఆయన తనయుడు, సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఖాసీం రజ్వీలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ఆదివారం మండిపడ్డారు. తెరాస తెలంగాణ ఉద్యమం అనే తులసి వనంలో ఓ గంజాయి మొక్క అని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సెంటిమెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడితే, వాటిని టిడిపి దృష్టికి తీసుకు వస్తే తాము బాధితులకు అండగా ఉంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు వ్యాపారంగా మార్చి వేశారని ఆరోపించారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తాను మాత్రం ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉద్యమం అంటున్నారని టిడిపి ఎంపీ రమేష్ రాథోడ్ విమర్శించారు.

అధికారంలోకి వస్తే మజ్లిస్ పైన చర్యలు: బిజెపి

2014లో తాము అధికారంలోకి వస్తే కేసులు ఎదుర్కొంటున్న మజ్లిస్ పార్టీ నేతలపై చర్యలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ముఖ్య నేత వెంకయ్య నాయుడు ఆధివారం అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 61వ వర్ధంతి సందర్భంగా బిజెవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖర్జీ ఆశయాలను యువత కొనసాగించాలన్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపి జయకేతనం ఎగురవేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత జాకీయస్థాయిలో రాజకీయ పునరేకీకరణ ఉంటుందన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెసు పార్టీకి మద్దతిస్తే అది దురదృష్టకరమన్నారు.

మజ్లిస్, ముస్లిం లీగ్‌లతో పొత్తు పెట్టుంటున్న కాంగ్రెసు పార్టీ తమను మతతత్వ పార్టీ అనడం విడ్డూరమన్నారు. తాము అధికారంలోకి వస్తే మజ్లిస్ పార్టీ నేతలపై చర్యలు తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+