తట్టను ఎత్తిన షర్మిల: ఈ రోజు 2,500కి.మీ.మైలురాయి

రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఆమె పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఆదివారం నాటికి ఆమె పాదయాత్ర 188వ రోజుకు చేరుకుంటుంది. ఈ రోజుతో షర్మిల పాదయాత్ర 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. పాదయాత్రలో ప్రజలకు హామీలు, భరోసా ఇస్తూ.. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరుగుతూ సాగుతున్నారు.

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, అలాంటి కుటిల రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలని ఆమె చెబుతున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా ఇస్తున్నారు. ప్రజల కోసమే జగన్ కాంగ్రెసు పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారని చెబుతున్నారు.

Sharmila to complete 2,500 KM padayatra

షర్మిల చిన్నారులను ముద్దాడుతూ, పెద్దలను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం ఆమె ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తట్టను నెత్తిన పెట్టుకొని అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సమయంలో ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో నాటి చంద్రబాబు పాలనే కనిపిస్తోందని దుయ్యబట్టారు.

ఆదివారం తుని నియోజకవర్గంలోని కాకరాపల్లిలో షర్మిల 2,500 కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు. ఓ మహిళ ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం గమనార్హం. నిన్నటి వరకు షర్మిల 181 రోజులు నడిచి, 91 నియోజకవర్గాల్లో పర్యటించారు. కాకరాపల్లిలో షర్మిల దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+