ఎపి భవన్ వద్ద బాబు ధర్నా: మోడీపై ప్రశంసలు

ఇంత పెద్ద విపత్తు దేశాన్ని కుదిపేస్తోందని, ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ప్రకతి వైపరీత్యం లేదుని ఆయన అన్నారు. కేంద్రంలో 13 మంది రాష్ట్రానికి చెందిన మంత్రులున్నా తెలుగు యాత్రికులకు తగిన సహాయం అంధించడం లేదని ఆయన అన్నారు. కేంద్రంతో సహా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో స్పందించాలని ఆయన అన్నారు. దీనిని జాతీయ విపత్తుగా పరిగణించాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.
విపత్తు సహాయ నిధినుంచి సహాయ కార్యక్రమాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సానికి గురైన ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సూచించారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మందులతో సహా 20 మంది డాక్టర్ల బృందాన్ని ఉత్తరాఖండ్‌కు పంపిస్తున్నట్లు తెలుగుదేశం నాయకుడొకరు చెప్పారు. ఈ ప్రభుత్వం తమకు హెలికాఫ్టర్ సదుపాయం కల్పిస్తే 20 మందే కాదు వంద ప్రాంతాలకకు డాక్టర్లను పంపేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications