ప్రధాని పర్యటనకు ముందు తెగబడ్డ టెర్రరిస్టులు

ఉగ్రవాదులపై సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. ఇరు పక్షాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలానికి అదనపు బలగాలు చేరుకున్నాయి. డజన్ రౌండ్లు మిలిటెంట్లు కాల్పులు జరిపిన తర్వాత సంఘటనా స్థలాన్ని సైనికులు చుట్టుముట్టి దిగ్బంధం చేశారు మిలిటెంట్ల కోసం సైనికులు గాలిస్తున్నారు.
దక్షిణ, ఉత్తర కాశ్మీర్‌లను కలిపే రైలు లైనును మన్మోహన్ సింగ్ రేపు మంగళవారం ప్రారంభించనున్నారు. అభివృద్ధి పథకాలను అధికారులతో సమీక్షించనున్నారు. శ్రీనగర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని హజ్బుల్ ముజాహిదీన్ ప్రకటించుకుంది.
శనివారంనాడు మిలిటెంట్లు ఇద్దరు పోలీసులను కాల్చి చంపారు. గస్టీ తిరుగుతున్న పోలీసులపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఉగ్రవాదులు కాల్చి చంపారు. శ్రీనగర్‌లో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications