ఒరిజినలివ్వండి: సబిత, ధర్మాన మెమోపై సిబిఐకి కోర్టు

మీడియా ముందు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడిన ఒరిజినల్ సిడిలను సమర్పించాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. పూర్తిస్థాయి ప్రసంగ పాఠాలను సమర్పించాలని చెప్పింది. దీంతో సిబిఐ వారికి ఒరిజినల్ సిడిలను అందజేసింది. విచారణను జూలై 1కి వాయిదా వేసింది. వారిద్దరు రాజీనామా చేసిన సమయంలో మీడియాతో మాట్లాడారు.
దీంతో వారు మాట్లాడిన అంశాలను యూ ట్యూబ్ ద్వారా తీసుకున్న సిబిఐ వారిని తమ కస్టడీకి అనుమతించాలని, బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలున్నాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వారం రోజుల క్రితం వారు మెమో దాఖలు చేశారు.
తాము మీడియాతో మాట్లాడిన సిడి అస్పష్టంగా ఉందని, ఒరిజినల్ టేపులను ప్రవేశపెడితేనే తాము కౌంటర్ దాఖలు చేస్తామని మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులు బుధవారం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో గతవారం మెమో దాఖలు చేశారు.
తాము మీడియాలో మాట్లాడిన సిడి అస్పష్టంగా ఉందని మెమోలో పేర్కొన్నారు. ఒరిజినల్‌వి ఇస్తే కౌంటర్‌కు సిద్ధమని చెప్పారు. తాము రాజీనామా ఎందుకు చేశామో ప్రజలకు చెప్పేందుకే మీడియాతో మాట్లాడామని వారు చెప్పారు. కాగా రాజీనామా చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషులుగా నిరూపించుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications