వరదలు: మజ్లిస్ భారీ విరాళం, ఉ.ఖండ్‌కు చిరు ప్యాకేజ్
హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని భారీ వరదల వల్ల వేలాది మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో భక్తులు అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా పలు రాజకీయ పార్టీలు బాధితులకు సహకరించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు తదితర పార్టీలు వైద్య సేవలు అందిస్తున్నాయి. మరికొన్ని పార్టీ నేతలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
వివిధ పార్టీలు, ప్రభుత్వాలు విరాళాలు ప్రకటించాయి. రాష్ట్రపతి నెల జీతం ఇవ్వగా, తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలత ఐదు కోట్లు ప్రకటించారు. ఇతర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా తమవంతుగా సహాయం చేశారు. మన రాష్ట్రంలో హైదరాబాదులో ప్రధానంగా ఉన్న మజ్లిస్ పార్టీ కూడా భారీ సాయం అందజేసింది.

పార్టీ తరఫున చేయాల్సిన సాయం పైన ఆ పార్టీ నేతలతో సమావేశమై మంగళవారం చర్చించారు. అనంతరం ప్రధానమంత్రి సహాయ నిధికి ఆరు లక్షల రూపాయలు అందజేయడంతో పాటు, ఇరవై లక్షల రూపాయల విలువైన మందులను, దాదాపు యాభై నాలుగు లక్షల విలువైన ఆహారం కిట్లను పదివేల కుటుంబాలకు స్వయంగా అందజేయాలని నిర్ణయించారు.
ఉత్తరాఖండ్‌కు చిరు ప్యాకేజ్
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పర్యాటక శాఖ నుండి రూ.100 కోట్ల ప్యాకేజీని బుధవారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications