తెలంగాణపై నాతో ఎవరూ మాట్లాడలేదు: చిరంజీవి

కాగా, తెలంగాణకు ప్యాకేజీ ఇస్తారనే ఊహాగానాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కొట్టిపారేశారు. ప్యాకేజీలు మీడియా సృష్టేనని ఆయన అన్నారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో తలపెట్టిన తెలంగాణ బహిరంగ సభ పోస్టరును ఆయన బుధవారం విడుదల చేశారు. తెలంగాణ నినాదాన్ని కాంగ్రెసు అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లడానికే ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అధిష్టానం తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తమకు ఉందని ఆయన దీమా వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, తమకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలన్నదే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని ఆయన బుధవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని, త్వరగా ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ తప్ప ఎలాంటి ఫ్యాకేజీలకు అంగీకరించేది లేదని కోదండరాం స్పష్టం చేశారు.
తెలంగాణం వ్యవహారంలో ప్యాకేజీల పేరుతో తెలంగాణ ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్యాకేజీలకు బీజేపీ వ్యతిరేకమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో తేల్చిచెప్పారు. ఈనెల 27వ తేదీన హైదరాబాద్‌లో తెలంగాణ జిల్లాల బిజెపి నేతలతో సమావేశమవుతామని, అదే రోజు నవభారత్ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications