శంకర రావుకు రెండోసారి సైఫాబాద్ పోలీసుల నోటీసులు

శంకర రావుకు నోటీసులు పంపడం ఇది రెండోసారి. రేపు కూడా ఆయన పోలీస్ స్టేషన్‌లో హాజరు కాకపోతే కోర్టు ఆదేశాలతో అరెస్టు వారెంట్ తెచ్చుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. శంకర రావు ముఖ్యమంత్రి, డిజిపి పైన వ్యాఖ్యలు చేశారని మూడు రోజుల క్రితం మొదటిసారి నోటీసు జారీ అయింది.
కాగా, శంకర రావు, ఆయన కుటుంబం పైన వంశీప్రియ అనే యువతి ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో శంకర రావుతో పాటు ఆయన కుమారుడు శశాంక్‌కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. వారితో పాటు డిజిపి, సిసిఎస్ మహిళా పోలీసు స్టేషన్‌లకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శంకర రావు, ఆయన కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ వంశీప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై శంకర రావు సిసిఎస్ మహిళా పోలీసుల ఎదుట గత బుధవారం లొంగిపోయారు. శంకర రావుతో పాటు ఆయన భార్య విశ్వశాంతి కూడా లొంగిపోయారు. వారు అప్పటికే ముందస్తు బెయిల్ పొందారు. అయితే వంశీప్రియ తన కోడలు అనే వాదనను శంకర రావు కొట్టిపారేశారు. శంకర రావును వరుసగా కేసులు వేధిస్తున్నాయి.












Click it and Unblock the Notifications