ఇడుపులపాయలో టి అంశం: మైసూరా, వట్టిదే: పనబాక

Mysoora Reddy
హైదరాబాద్/గుంటూరు: తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వటమా? రాష్ట్రాన్ని విభజించటమా? అనే అంశంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, తాము ఇడుపులపాయ ప్లీనరీలో తెలంగాణ ప్రస్తావన తెస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు మైసూరా రెడ్డి మంగళవారం అన్నారు. జూలై 8న ఇడుపులపాయలో ఒకరోజు జరిగే పార్టీ ప్లీనరీలో చేసే రాజకీయ తీర్మానంలో తెలంగాణ ప్రస్తావన ఉంటుందని చెప్పారు.

మరోవైపు ప్యాకేజీల డ్రామాను కాంగ్రెస్ మానుకోవాలని, హైదరాబాద్‌తో గల తెలంగాణే కావాలని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వివిధ ప్రాంతాల రాజకీయ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారే తప్ప ఎలాంటి నిర్ణయం వెలువడనుందో ఎవరికీ తెలియదని పనబాక లక్ష్మి అన్నారు. ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని ఆమె చెప్పారు.

తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఆడుతున్న నాటకాలు ఆపాలని, తెలంగాణ ఇవ్వాలని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరేది పరిష్కారం కాదని అని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ అపహాస్యం చేస్తోందని, వాయిదాలతో కాలం గడుపుతోందని మండిపడ్డారు. తెలంగాణ కోరుకుంటున్న రాజకీయ పార్టీల మధ్య ఐక్యత, సఖ్యత అవసరమన్నారు.

కొన్ని పార్టీలు తమ రాజకీయ లబ్ధి, స్వప్రయోజనాల కోసం సంకుచిత వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ప్రజలు రాజకీయ ఐక్యతను కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని రాజకీయ అనిశ్చితికి తెరదించడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ప్యాకేజీ, రాయల తెలంగాణ వంటివేవి పరిష్కారం కావని నారాయణ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+