వరదలపై నారా లోకేష్: బాబుVsకిరణ్‌తో లాభం(పిక్చర్స్)
డెహ్రాడూన్/హైదరాబాద్: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితులకు మన రాష్ట్ర రాజకీయాలు లబ్ధి చేకూరుస్తున్నాయి! వరద బాధితులకు మన రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందలేదని, గుజరాత్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలను చూస్తే అర్థమవుతుందని అంటున్నారు. అదే సమయంలో దీనిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తోందనే విమర్శలు వచ్చాయి.
రాజకీయ లబ్ధి కోసం ఎవరు వినియోగించుకోవాలని చూసినప్పటికీ భక్తులకు మాత్రం మేలు జరిగిందని చెప్పవచ్చు. తమ రాష్ట్రానికి చెందిన వారు వేయి మంది వరదల్లో చిక్కుకున్నారని తెలిసిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఏరియల్ సర్వే చేసి, తమ రాష్ట్ర భక్తులకు అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా అదే తరహా చర్యలు చేపట్టాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కించిందని పలువురు భక్తులు మండిపడుతున్నారు.
అనుకున్న స్థాయిలో ప్రభుత్వం నుండి సహకారం లభించలేదంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని టిడిపి బాగా ఉపయోగించుకుందని అంటున్నారు. అమెరికా నుండి వచ్చిన చంద్రబాబు వెంటనే ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. బాబు ధర్నా తర్వాత ఎపి భవన్‌కు చేరుకున్న భక్తులకు మరిన్ని మంచి సదుపాయాలు కల్పించారట. ఆయన అక్కడే ఉండి సమీక్ష చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందించారు. ఎపి భవన్ అధికారులు ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్యులకు నో చెప్పడం ద్వారా టిడిపి పేరు మరింత మోగింది.

వరద బాధితులను పరామర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

ఉత్తరాఖండ్ వరద బాధితులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

టిడిపి విమానంలో హైదరాబాదు చేరుకున్న వారికి నారా లోకేష్ ఓదార్పు

ఉత్తరాఖండ్ వరదల్లో అస్తవ్యస్తంగా తయారైన గౌరీ కుండ్. అన్నీ తుడుచి పెట్టుకుపోయాయి.

వరదల నుండి జవాన్ల సహకారంతో బయటపడిన భక్తులు గౌచర్‌లో హెలికాప్టర్ కోసం నిరీక్షిస్తున్నారు.

వరదల కారణంగా లేవలేని స్థితిలో ఉన్న ఓ భక్తుడిని స్ట్రెచర్ ద్వారా తీసుకు వెళ్తున్న సైనికులు

మంగళవారం సైనికులతో కూడిన ఎంఐ 17 కూలింది. దానిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్న జవాన్లు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు.

వరదల అనంతరం ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్ దృశ్యం. వరదల కారణంగా కోత ఏర్పడి ఇళ్లు నేలమట్టమయ్యాయి.

జోద్‌పూర్ చేరుకున్న ఉత్తరాఖండ్ వరదల బాధితులు. బాధితురాలని ఎత్తుకున్న ఓ బంధువు.

వరదల నుండి ప్రాణాలతో బయటపడిన తమ వారికి నీళ్లు తాగిస్తున్న ఓ బంధువు.

జోద్‌పూర్ చేరుకున్న ఉత్తరాఖండ్ వరదల బాధితులు. కన్నీళ్లు పెట్టుకున్న బయటపడ్డ బాధితురాలు

లంబనగర్ ప్రాంతంలో అలకనంద నది వద్ద బాధితులను రక్షించేందుకు వెళ్తున్న ఐటిబిపి జవాన్

కేదార్ నాథ్ ఆలయం వద్ద గల మృతదేహాల అంత్యక్రియల కోసం కర్రలను కిందకు వేస్తున్న హెలికాప్టర్

ఐటిబిపి జవాన్ తాడు, నిచ్చనె సహాయంతో బాధితుడిని తరలిస్తున్న దృశ్యం

అలకనంద నది వద్ద రోప్ బ్రిడ్జ్ ద్వారా బాధితుడిని తీసుకు వస్తున్న జవాన్.

లంబనగర్ ప్రాంతంలో బాధితుడికి అన్నం తినిపించే ప్రయత్నం చేస్తున్న ఓ జవాన్

ఓ వాహనం నుండి హెలికాప్టర్‌లోకి కర్రలను ఎక్కిస్తున్న సిబ్బంది

భారీగా కురుస్తున్న వర్షాలు సహాయ చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి.

వరదల్లో చిక్కుకుపోయిన వాహనాలను చూస్తున్న దృశ్యం. వరదల్లో భారీ వాహనాలు సైతం కొట్టుకుపోయాయి.

ఉత్తరాఖండ్‌లోని రుషికేష్ ప్రాంతంలో గంగా నది కారణంగా మునిగిన ఇళ్లు.

న్యూఢిల్లీలోని ఓ పాత వంతెనను ఆనుకొని పొంగుతున్న యమునా నది.

ఉత్తరాఖండ్ వరదలకు కూలిపోయిన ఓ భవంతి. వరద తాకిడికి భవంతి కొట్టుకుపోయింది

భారీ వర్షాల కారణంగా రుద్రప్రయోగ వద్ద అలకనంద ప్రవాహం.

భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో పొంగిపొర్లుతున్న మందాకిని నది.

రుద్రప్రయాగ ప్రాంతంలో వరద బీభత్సం. శిథిలమైన వంతెన కింద నుండి వెళ్తున్న అలకనంద ప్రవాహం.

వరదల కారణంగా యమునా నది ప్రవాహానికి ఫరీదాబాదులోని మంజౌలి గ్రామంలో కొట్టుకొపోయిన ఓ వంతెన.
అదే సమయంలో నిత్యం ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంతమంది భక్తులు వరదల్లో చిక్కుకుంటే ఏరియల్ సర్వేకు ఎందుకు వెళ్లలేదనే ఆరోపణలు వచ్చినా.. అందుకు ఇతర నేతలు సమాధానం చెప్పారు. అయితే ఢిల్లీ వెళ్లి బాధితులను పరామర్శించేందుకు ఇన్ని రోజులు తీసుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి తీరు పైన విమర్శలు వచ్చినా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిలకు మాత్రం ప్రశంసలు వచ్చాయి.
నిన్న ఢిల్లీ వెళ్లిన కిరణ్ వరదలను రాజకీయం చేయవద్దని సూచిస్తే.. సాయం చేసేందుకే వచ్చామని చంద్రబాబు చెప్పారు. టిడిపి తరఫున భక్తులకు వైద్య సహాయం, మందులతో పాటు భక్తులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్, విశాఖలకు తరలించి, అక్కడి నుండి టిడిపి నేతల బస్సుల్లోనే ఇళ్లకు చేరవేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు జిల్లా పార్టీ ముఖ్య నేతలకు, అధ్యక్షులకు ఫోన్ చేసి బాధితులను ఇళ్లకు చేరే వరకు బాధ్యత వహించాలని చెప్పారు.
ఆ తర్వాత ప్రభుత్వం కూడా విమానాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్ వరద విషయంలో ఎవరికి వారు రాజకీయం చేయాలనుకున్నప్పటికీ బాధితులకు మాత్రం దాని ద్వారా లబ్ధి చేకూరుందని అంటున్నారు. రాజకీయంపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్పందిస్తూ... బాబు రాజకీయం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారని, అది రాజకీయమనుకుంటే భక్తులకు మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. టిడిపి నేతలు రాజకీయ లబ్ధి వార్తల కొట్టిపారేస్తున్నారు.
జవాన్‌లారా! సెల్యూట్: ఒమర్
ప్రాణాలకు తెగించి ఉత్తరాఖండ్ వరద బాధితులను కాపాడుతున్న సైనికులను యావత్ భారత దేశం కొనియాడుతోంది. సహాయ చర్యల్లో ఇప్పటికే పలువురు జవాన్లు మృతి చెందారు. అయినా సైనికులు బాధితులకు అండగా ఉంటున్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని, తామున్నామని భరోసా ఇస్తున్నారు. సైన్యం సహకారాలకు ముగ్ధుడైన జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 'జవాన్‌లారా! ఇదే నా సెల్యూట్' అన్నారు.
అంటువ్యాధుల భయం
కాగా, ఉత్తరాఖండ్ వరదల్లో వేలాది మంది మృతి చెందడం, శవాలు కుళ్లి పోతుండటంతో అంటు వ్యాధుల భయం పట్టుకుంది. వ్యాధుల భయంతో అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెయ్యి, కలప సరఫరాకు మూడు విమానాలను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications