ఫ్లడ్ పొలిటిక్స్: రమేష్ రాథోడ్, విహెచ్ డిష్యూం డిష్యూం

వారిద్దరి మధ్య పోలీసులు జోక్యం చేసుకున్నారు. డెహ్రాడూన్‌లో తెలుగువాళ్ల రాజకీయాలను బయటపెట్టుకున్నారు. తొలుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నారాయణకు మధ్య వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. ఈ వివాదంలో విహెచ్ జోక్యం చేసుకున్నారు. దాంతో వివాదంలోకి రమేష్ రాథోడ్ కూడా వచ్చి చేరారు. వారిద్దరి మధ్య తోపులాట తెలుగు టీవీ చానెళ్లలో ప్రముఖంగా ప్రసారమైంది. కాగా, పార్లమెంటు సభ్యుడు నారాయణను కేంద్ర మంత్రి బలరాం నాయక్ దూషించినట్లుగా కూడా చెబుతున్నారు.
కాంగ్రెసు ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని రమేష్ రాథోడ్ అన్నారు. తాము రెండు సార్లు విమానంలో బాధితులను విశాఖపట్నం తరలించామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము ఏర్పాటు చేసిన డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఎపి భవన్‌లో తాము నియోగించిన వైద్యులను తరిమేశారని ఆయన విమర్శించారు.
బాధితులను ప్రభుత్వం హైదరాబాదు తరలిస్తామని చెబుతోందని, తాము విశాఖపట్నం తరలించామని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వివాదంతో వరద బాధితులు బిత్తరపోయారు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడ్డారు. ఉత్తరాఖండ్ వరద భాధితులను తరలించే విషయంలో డెహ్రాడూన్ విమానాశ్రయంలో గొడవ జరిగింది. ఇదంతా చంద్రబాబు సమక్షంలోనే జరిగింది.












Click it and Unblock the Notifications