వరదలు: బొత్సని ప్రశ్నించిన వ్యక్తి, చీరతో మహిళ ధైర్యం

U'Khand victim questions Botsa
హైదరాబాద్/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న ఓ బాధితుడు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను నిలదీసినంత పని చేశారట. ఉత్తర కాశీ వరదల్లో అందరితో పాటు తెలుగు వారు కూడా భారీగా చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల వలే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఓ బాధితుడు బొత్సకు ఫోన్ చేసి అడిగారట.

ఉత్తర కాశీ యాత్రకు వచ్చి వారం రోజులుగా వరదల్లో చిక్కుకున్నామని, తమను ఆదుకోవాలని, తమ బృందంతో పాటు మరికొన్ని బృందాలు కూడా ఉన్నాయని, తమను పలుకరించే నాధుడే లేరని, తామంతా డెహ్రాడూన్‌కు 300 కిలో మీటర్ల దూరంలోని బాంగర్ ధర్మశాలలో ఉన్నామని, తమతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారున్నారని, వారిని కర్ణాటక రాష్ట్ర మంత్రులు పరామర్శించి, వారికి సహాయమందించారని కాని.. తాము మాత్రం ఎంతమంది మంత్రులకు ఫోన్ చేసినా వారి నుంచి స్పందన రావడం లేదని బొత్సకు ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశారట.

చీర సహాయంతో బయటపడ్డ మహిళ

కృష్ణా జిల్లాకు చెందిన పద్మజ బృందం గౌరీకుండ్‌లో ఒక మూడంతస్తుల భవనంలో బసచేసింది. భారీ వరద ఒక్కసారిగా రావడంతో చూస్తుండగానే రెండు అంతస్తులు మునిగిపోయాయి. ఆమె ముందు పదిమంది కొట్టుకుపోయారు. భవంతి క్రమంగా ఒరిగిపోతోంది. కింద ఉన్నవారంతా జలసమాధి అయిపోయారు. దీంతో పద్మజ ధైర్యం చేసి తన చీరనే తాడుగా కట్టుకుని ఆ భవనం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు.

అక్కడ ఉన్న వారంతా ఆమెను అడ్డుకున్నారు. వరద ధాటికి కొట్టుకుపోతావంటూ ఆపే ప్రయత్నం చేసినా ఆమె ఆగలేదు. చీర సాయంతోనే కిందకు దిగి తప్పించుకుంది. ఆమె ధైర్యంగా వరదను దాటడంతో అక్కడ ఉన్న 25 మంది కూడా పద్మజ చీరను పట్టుకుని దిగి.. వరద నుంచి తప్పించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+