మమ్మల్ని దెబ్బతీసేందుకే రాయల తెలంగాణ: జగన్‌పార్టీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తించింది: విజయమ్మ
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు భరోసా ఇచ్చే నాయకుడు లేడని, ప్రజలకు ఏం కావాలో తమ పార్టీ గుర్తించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గురువారం అన్నారు. ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీకి ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉందన్నారు. స్థానిక ఎన్నికలే పార్టీకి పునాది అని, పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటాలని ఆమె పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక పోవడంతో పంచాయతీలు చతికలపడ్డాయన్నారు. ఏదో కారణం చెప్పి ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, కాంగ్రెసు, టిడిపి కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలను కోరారు.
పంచాయతీ ఎన్నికలలో పార్టీకి అఖండ మెజార్టీతో విజయం సాధించి పెట్టాలన్నారు. ఇందుకోసం నాయకులు సమష్టిగా కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన నాడు చంద్రబాబు నాయుడు పాలనను తలపిస్తోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications