తెలంగాణ: గెలుస్తామని జానా, తెలియదని పురంధేశ్వరి

2014లోపే తెలంగాణ వస్తుందని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత దేశ స్వాతంత్రానికి కొన్ని ఏళ్లు పట్టిందని, తెలంగాణ కూడా అంతేనన్నారు. తెలంగాణ రావడం మాత్రం ఖాయమని, అప్పుడు రెండు ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందన్నారు.
ఈ నెల 30వ తేదిన నిర్వహించనున్న సభ తెలంగాణ ప్రజల ఆకాంక్షను అధిష్టానానికి, కేంద్రానికి తెలియజేసేందుకేనని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి కోసమే తాము సభలు పెడుతున్నామనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అలాంటి వాదన సరికాదన్నారు. తెలంగాణ వచ్చే వరకు పోరాడుతామని, సాధన కోసం ఎలాంటి డెడ్ లైన్లు లేవన్నారు.
జానా రెడ్డి ఆస్తులపై మళ్లీ పిటిషన్
కాగా జానా రెడ్డి ఆస్తులపై మరోసారి పిటిషన్ దాఖలయింది. జానా ఆస్తుల పైన సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషన్‌దారు కోరారు. గతంలో ఇదే పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మార్పులతో అదే పిటిషన్‌ను దాఖలు చేశారు.
దిగ్విజయ్‌కు తెలుసు: పురంధేశ్వరి
రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా వచ్చిన దిగ్విజయ్ సింగ్‌కు రాష్ట్ర పరిస్థితులపై పూర్తిగా తెలుసునని, ఇక్కడి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొనే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని చెప్పారు. ఢిల్లీ పెద్దలు అన్నింటిని పరిగణలోకి తీసుకొని తెలంగాణ, సమైక్యాంధ్రలపై నిర్ణయం తీసుకుంటారన్నారు. తాము తమ వైఖరిని అధిష్టానానికి తెలియజేశామన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నట్లు తన దృష్టికైతే రాలేదని ఆమె అన్నారు.
విభజన అంటే అన్యాయం: టిజి వెంకటేష్
ప్రస్తుత పరిస్థితుల్లో విభజన అంటే అన్యాయమేనని మంత్రి టిజి వెంకటేష్ సచివాలయంలో అన్నారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, పొరపాటు అని చెప్పి సమైక్యాంధ్రకు ఒప్పిస్తామన్నారు. 2009లో ఇలాగే నిర్ణయం తీసుకున్నప్పుడు ఒప్పించామని అన్నారు.












Click it and Unblock the Notifications