భౌగోళికంగా విడిపోయినా ఒక్కటిగానే: 'టీ'పై డిఎస్

తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అందరూ ప్రకటిస్తున్నారని, ఇది ఆహ్వానించదగిన పరిణామమని ఆయన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ప్రకటన నేపథ్యంలో అన్నారు. తెలుగువాళ్లంతా సుఖశాంతులతో ఉండేలా అధిష్టానం నిర్ణయం తీసుకుటుందని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాతో భేటీ తర్వాత సీమాంధ్ర నేతల్లో వ్యతిరేకత కన్పించడంలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాయల తెలంగాణ, ప్యాకేజీ అంశాలను ఆయన కొట్టిపారేశారు. తెలంగాణపై ఇప్పుడు తీసుకునే నిర్ణయం శాశ్వత పరిష్కారం దిశగా ఉంటుందని డిఎస్ చెప్పారు. కొందరు రెచ్చగొట్టడం వల్ల భయాలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమానికి చాలా ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. ఈ నెల 30వతేదీన జరిగే తెలంగాణ కాంగ్రెసు సభలో తాను పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.తెలంగాణ ఇస్తారనే విశ్వాసం కలుగుతోందని ఆయన అన్నారు.
రాయల తెలంగాణ, ప్యాకేజీలు తమకు వద్దని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. నిజాం ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ మాత్రమే తమకు కావాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications