జైపాల్ రెడ్డితో డిగ్గీ భేటీ: సిఎంతో సోనియా నో భేటీ

గురువారం రాత్రి పొద్దుపోయాక జైపాల్ రెడ్డి వద్దకు దిగ్విజయ్ వెళ్లారు. ఒకవైపు ఢిల్లీలో తెలంగాణపై హడావిడి జరుగుతోంది. మరోవైపు దిగ్విజయ్ 30, 1 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ జైపాల్ రెడ్డితో జరిపిన భేటీకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలావుంటే, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కాకుండానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదుకు వెనుదిరిగారు. పలువురు అధిష్టానం పెద్దలతో సమావేశమైన తర్వాత గురువారం ఆయన సోనియాతో సమావేశం కావాల్సి ఉండింది. కానీ, అది జరగలేదు. సోనియా గాంధీ ప్రస్తుత, మాజీ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇంచార్జీలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్‌లతో సమావేశమయ్యారు.
ఆ సమావేశం తర్వాత ఆజాద్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ వచ్చింది. దీంతో సోనియాతో తాను కలవాల్సిన అవసరం లేదని కిరణ్ కుమార్ రెడ్డికి సమాచారం అందింది. దీంతో ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణం కట్టారు. తెలంగాణపై తీసుకునే నిర్ణయం విషయంలో కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
సంకేతాలు లేవు: జానారెడ్డి
తెలంగాణకు సంబంధించి అధిష్ఠానం నుంచి తమకు ఎలాంటి సంకేతాలు రాలేదని రాష్ట్ర మంత్రి జానారెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజల ఆకాంక్షలను మరోసారి అధిష్ఠానానికి వినిపించేందుకే ఈనెల 30న బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని ఆయన గురువారం హైదరాబాదులో తెలిపారు. రాయల తెలంగాణ, ప్రత్యేక ప్యాకేజీలు ఊహాజనితాలేనన్నారు.












Click it and Unblock the Notifications