జెఏసిపై కిషన్ రెడ్డి అసంతృప్తి, జాతీయ పార్టీలపై కెటిఆర్

బిజెపి తెలంగాణ ఉద్యమ కార్యాచరణ సదస్సు గురువారం జరిగింది. అంతకుముందు పార్టీ కార్యాలయంలో తెలంగాణ జెఏసి నేతలు బిజెపి నేతలతో సమావేశమయ్యారు. ఈ రెండు సందర్భాల్లో పార్టీల్లో జేఏసీ నేతల చేరిక అంశం ప్రధాన ఎజెండాగా మారింది. అనంతరం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... "కొందరు జెఏసి నేతలు పార్టీల్లో చేరి ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారంటూ వార్తలొస్తున్నాయి. ఉద్యమాన్ని మధ్యలో వదిలేసి తమ దారి తాము చూసుకుంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు.
మాలాంటి పార్టీలు మిమ్మల్ని నమ్మి, ఉద్యమ నేతలుగా ఎన్నుకున్నాయి. రాజకీయ వాసన తగలకుండా, ఉద్యమాన్నే అంటిపెట్టుకున్నారని ఆశించాం. మీపై ప్రజలు ఎంతో ఆశతో ఈ బాధ్యతలను అప్పగించారు. వారి ఆశలను వమ్ము చేస్తూ మీ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు చూసుకుని వెళ్లిపోతే ఉద్యమానికి అన్యాయం చేసినవారవుతారు. మీకు పార్టీల్లో చేరాలని ఉంటే ఎన్నికలకు దాదాపు ఏడాది కాలం ఉంది.
ఎన్నికలు ప్రకటించాక... ఏ పార్టీలో చేరినా మాకు అభ్యంతరం లేదు. లేకపోతే, తెలంగాణ వచ్చాకనైనా పార్టీల్లో చేరవచ్చు. మా పార్టీ ఉద్యమం ఓట్లు, సీట్ల కోసం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న ఉద్దేశంతో మొదటినుంచి ఉద్యమిస్తోంది. తెలంగాణ అంశం తెగేదాకా కొట్లాడుతాం. మీరు మాత్రం ఇప్పటికైతే జెఏసిలో ఉండి పోరాడండి. ఇప్పట్లో పార్టీల్లో చేరే ఆలోచన పెట్టుకోవద్దు'' అని హితవు పలికారు.
జాతీయ పార్టీలు లేవు: కెటిఆర్
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు జాతీయ పార్టీలు లేవని అన్నారు. జాతీయ పార్టీతోనే తెలంగాణ సాధ్యమని, బిజెపి ఇస్తుందని ఆ పార్టీ చెబుతున్న సందర్భాలలో తెరాస.. జాతీయ పార్టీలు అంటూ ఏవీ లేవని వ్యాఖ్యానిస్తోంది.












Click it and Unblock the Notifications