మహిళపై గ్యాంగ్ రేప్, హత్య: బాలికపై అత్యాచారయత్నం

ఈ నెల 24న ఉపాధిపనులకు వెళ్లిన శివపార్వతి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె శవం కూడా లభించలేదు. ఆమెపై అత్యాచారం చేసి చంపి శవాన్ని మాయం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన నలుగురు యువకులపై బంధువులు అనుమానాలను వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో మానసికంగా ఎదగని ఓ బాలికపై కామాంధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని తిరుమల్‌నగర్‌లోని ఓ బాలిక(11)పై శుక్రవారం ఇంజనీరింగ్ విద్యార్థి గండ్ర అమర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
అతని తల్లి ఆర్‌బీసీ పాఠశాలను నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులు రాకపోవడంతో పాఠశాలను తెరవమని అమర్‌ను అతని తల్లి పంపించింది. అప్పటికే పాఠశాలకు వచ్చిన బాలికను కొట్టి అదే పాఠశాలలో అమర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు కామాంధుడికి దేహశుద్ధి చేయగా, తప్పించుకొని పరారయ్యాడు.












Click it and Unblock the Notifications