ఫొటోలు: ఉత్తరాఖండ్ ట్రాజెడీ, మృతులు పది వేలపైనే

జోషీమఠ్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్‌లో శనివారం వాతావారణం తెరిపినిచ్చిది. దీంతో వైమానిక సహాయచర్యలు ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రానికి సహాయక చర్యలను ముగించగలమనే ఆశాభావంతో అధికార వర్గాలున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఎగువ ప్రాంతాల్లో ఇంకా 2 వేల మందిదాకా చిక్కుకుని ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్ వరద మృతులు పదివేల మందికి పైగానే ఉంటారని రాష్ట్ర శానససభ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్‌వాల్ అన్నారు. తాను తిరుగుతున్నప్పుడు కనిపించిన విధ్వంసాన్ని చూసి అలా అంచనాకు వచ్చినట్లు చెప్పారు.

ప్రస్తుతం బద్రీనాథ్ ధామ్ ప్రాంతంలో దృష్టి కేంద్రీకరించారు. భద్రతా బలగాలు 50 హెలికాప్టర్లను వాడుతున్నాయి. 8 వేల బలగాలు సహాయక చర్యల్లో మునిగితేలుతున్నాయి. జోషిమఠ్‌లో సహాయక చర్యలకు జిందాల్ గ్రూప్ కూడా మూడు హెలికాప్టర్లను పంపించింది. గోవింద్ ఘాట్‌ లోయలో కొత్తగా వేసిన ఫుట్ ట్రాక్ ద్వారా బద్రీనాథ్‌లో చిక్కుకుపోయిన యాత్రికులను తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.

హార్సిల్‌లోని అందరినీ అక్కడి నుంచి తరలించారు. కేదార్‌నాథ్‌లో శవాలకు సామూహిక దహన క్రియలు సాగుతున్నాయి. సుశీల్ కుమార్ షిండే శుక్రవారం మరోసారి రాష్ట్రానికి వచ్చారు. చెత్త కింద చిక్కుకుపోయిన శవాలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన శుక్రవారం చెప్పారు.

గౌరీకుండ్‌లో సహాయక చర్యలకు వినియోగించిన హెలికాప్టర్ కూలడంతో మరణించిన 20 మంది సైనికుల అంత్యక్రియలకు ఆయన వచ్చారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్మీ చీప్ విక్రమ్ సింగ్ కూడా పాల్గొన్నారు. గ్రామాల్లో చిక్కుకుపోయినవారు ఇప్పటికీ ఆహారం కొరతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

అమరవీరులకు షిండే నివాళి

సహాయక చర్యల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సైనికులకు నివాళులు అర్పిస్తున్న కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, ఆర్మీ చీఫ్ విక్రమ్ సింగ్

అమరవీరులకు నివాళి

ఉత్తరాఖండ్‌ హెలికాప్టర్ కూలిన ఘటనలో మరణించిన లెప్టినెంట్ కె. ప్రవీణ్‌కు నివాళులు అర్పిస్తున్న దృశ్యం

అమరవీరులకు నివాళి

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలన ఘటనలో మరణించిన సైనికుల మృతదేహాలను హిందాన్ ఎయిర్ బేస్‌కు తీసుకుని వచ్చిన తర్వాత ఐఎఎఫ్ చీఫ్ మార్షల్ ఎన్ఎకె బ్రౌన్ నివాళులు అర్పిస్తున్న దృశ్యం

అమర వీరుల కుటుంబాలను ఓదారుస్తూ..

హెలికాప్టర్ కూలిన ఘటనలో మరణించిన సైనికుల కుటుంబాలను ఓదారుస్తున్న ఐఎఎఫ్ చీఫ్ ఎన్ఎకె బ్రౌన్ ఓదారుస్తూ ఇలా..

అమరవీరులను స్మరిస్తూ...

ఉత్తరాఖండ్‌లో మరణించిన లెఫ్టెనెంట్ తపన్ కపూర్ మృతదేహాన్ని తీసుకుని వచ్చిన ఐఎఎప్ అధికారి ఇలా అంత్యక్రియల సమయంలో...

హీరోలను కలిసి..

ఉత్తరాఖండ్ వరద తాకిడి ప్రాంతాలను సందర్శించిన తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ ఐటిబిపి జవాన్లతో గౌచార్ విమానాశ్రయంలో ఇలా..

సహాయక చర్యలు..

బద్రీనాథ్‌లో చిక్కుకుపోయిన బాధితులను తరలిస్తూ ఐటిబిపి జవాన్లు..

సహాయక చర్యలు

బద్రీనాథ్ వద్ద సహాయక చర్యల్లో ఐటిబిపి జవాన్లు ఇలా..

సహాయక చర్యలు

బద్రీనాథ్ వద్ద సహాయక చర్యలు చేపడుతూ ఐటిబిపి జవాన్లు ఇలా...

తోడునీడగా ఇలా...

బద్రీనాథ్ ప్రాంతంలో చిక్కుపడిపోయిన యాత్రికులను తరలిస్తూ ఐటిబిపి జవాన్లు...

భద్రంగా తిరిగి వెళ్తూ..

డెహ్రాడూన్‌‌లోని జోలీ గ్రంథ్ విమానాశ్రయంలో తమ ప్రాంతాలకు సురక్షితంగా విమానంలో వెళ్తూ యాత్రికులు...

తీర్చలేని నష్టం...

హెలికాప్టర్ కూలిన ఘటనలో మరణించిన ఫ్లయిట్ లెఫ్టినెంట్ తపన్ కపూర్ కుటుంబ సభ్యులు ఇలా.. అతని అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌లో జరిగాయి.

ఇంకా జాడ లేదు..

తప్పిపోయిన తమ కుటుంబ సభ్యులు, బంధువుల ఫొటోలతో యాత్రికులు డెహ్రడూన్‌లోని విమానాశ్రయంలో ఇలా అంగలారుస్తూ..

యాత్రికులను తరలిస్తూ..

జోషీమఠ్‌లోని యాత్రికులను తరలిస్తున్న జవాన్లు

తుది వీడ్కోలు..

హెలికాప్టర్ కూలిన ఘటనలో మరణించిన తపన్ కుమార్‌కు తుది వీడ్కోలు పలుకుతూ ఇలా...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+