బిర్యానీ మీటింగ్స్, హైకమాండ్ డైరెక్షన్లో: కాంగ్‌పై కెటిఆర్

కాంగ్రెసు పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తమ పార్టీ నుండి వలసలను ఆపేందుకే అధిష్టానం తమ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతలతో ఈ సభను నిర్వహింప చేస్తోందన్నారు. తెలంగాణ సాధన సభ పేరుతో కాంగ్రెసు మరో కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు.
కాంగ్రెసు నేతలవి కేవలం బిర్యానీ మీటింగులే అన్నారు. వారు లోపల బిర్యాని తిని, బయటకు వచ్చి తెలంగాణ కోసం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రగల్భాలు పలుకుతారని మండిపడ్డారు. తెలంగాణకు కాంగ్రెసు, బిజెపి రెండు పార్టీలు మోసం చేశాయన్నారు. తెలంగాణ సాధించాలంటే 15 పార్లమెంటు స్థానాలు కావాలన్నారు. అడిగే వారు ఎక్కువైతే తెలంగాణ సాధ్యమన్నారు.
వాస్తవ పరిస్థితి చెబుతాం: గంటా
చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి ఆటంకమని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కలిసి తాము వాస్తవ పరిస్థితిని ఆయనకు వివరిస్తామన్నారు. ఢిల్లీ పరిణామాలను తాము ఎప్పటికప్పుడు నిషితంగా పరిశీలిస్తున్నామన్నారు. అక్కడి పరిణామాలను బట్టి విశాఖ, విజయవాడ, హైదరాబాదులలో తాము సమైక్య సభలు నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications