వైయస్‌పై దిగ్విజయ్ ప్రశంసలు: కిరణ్ రెడ్డికి దెబ్బ

రాజశేఖర రెడ్డి వారసత్వం వైయస్ జగన్‌కు మాత్రమే పనికి వస్తుందనే నిర్ణయానికి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి క్రమంగా వైయస్ ఇమేజ్‌ను తుడిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బంగారుతల్లి, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్, తదితర సంక్షేమ కార్యక్రమాల ద్వారా వైయస్ పేరును తెర మరుగు చేయాలని ఆయన భావిస్తూ వస్తున్నారు. తాను చేసిన ప్రకటన కొత్త ఊహాగానాలకు తెర లేపడంతో వైయస్ జగన్ తమకు రాజకీయ ప్రత్యర్థి అంటూ ఆ తర్వాత మీడియా సమావేశంలో అన్నారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలన్నీ కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. వైయస్, జగన్ వేర్వేరు అని చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డికి దిగ్విజయ్ సింగ్ అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలుసు. అసలు వైయస్సార్ కాంగ్రెసుకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మధ్య ఉన్న గ్యాప్‌ను తొలగించడం కూడా దిగ్విజయ్ సింగ్‌ను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా నియమించడంలో ఉందని అంటున్నారు.
రాజకీయాలను, వ్యాపారాన్ని కలగలపడంపై తాను వైయస్ జగన్‌ను విమర్సించినట్లు కూడా దిగ్విజయ్ సింగ్ చెప్పారు. వైయస్ జగన్‌తో కాంగ్రెసు అధిష్టానం తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా లేదనే విషయం దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలతో తెలుస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications