తెలుగువారిగా కలిసుందాం: జానా, డిగ్గీపై పయ్యావుల

Jana Reddy and Payyavula Keshav
హైదరాబాద్: పరిపాలనా పరంగానే ఆంధ్ర ప్రదేశ్ విడిపోతుందని, తెలుగువారిగా అందరం కలిసే ఉంటామని, ఈ సమయంలోనే విభజనపై ప్రకటన చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి మంగళవారం అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ఇరు ప్రాంతాల నేతలు సహకరించారని ఆయన కోరారు. పార్టీలకతీతంగా అందరూ సహకరించాలన్నారు.

చిన్న రాష్ట్రాలు పాలనకు సౌలభ్యంగా ఉంటాయని చెప్పారు. మనసులు మాత్రం అందరివి కలిసే ఉంటాయన్నారు. తెలంగాణ సాధన సభ విజయవంతం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరకముందే తెలంగాణపై ప్రకటన చేయాలన్నారు. శాంతిగా ఉన్న సమయంలోనే సమస్య పరిష్కరించాలన్నారు.

విభజనపై స్పష్టత లేదు: పయ్యావుల

కాంగ్రెసు పార్టీకి విభజన విషయంలో స్పష్టత లేదని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ వేరుగా అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ విభజనపై చర్చకు దారితీసే వ్యాఖ్యలు చేశారన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. దిగ్విజయ్ సింగ్ గురించి గవర్నర్ నరసింహన్ మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. దిగ్విజయ్ కాంగ్రెసు పార్టీ ప్రతినిధిగా వచ్చారే తప్ప.. కేంద్రం ప్రతినిధిగా కాదని పయ్యావుల అన్నారు.

బంగారు తల్లిని ప్రారంభించిన కిరణ్

మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు లలిత కళా తోరణంలో బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రూణ హత్యలను తగ్గించాల్సి ఉందన్నారు. ఆడపిల్లలను చంపే హక్కు ఎక్కడిదన్నారు. సమాజంలో మార్పులను వేగవంతం చేయాలన్నారు. సమాజంలో మార్పు రావాలంటే అది ఇంటి నుండే ప్రారంభం కావాలన్నారు. గర్భిణీ స్త్రీల కోసం ఇందిరమ్మ అమృత హస్తం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తాము సమాజంలో మార్పుల కోసమే తప్ప రాజకీయం కోసం నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+