కెసిఆర్ నన్నూ రానివ్వలేదు: చీఫ్ అన్న కూతురు రమ్య

తాను కెసిఆర్ కుటుంబ సభ్యురాలిని అయినప్పటికీ, దానిని పక్కన పెట్టి, ఓ పార్టీ నేతగా తాను ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పారు. కెసిఆర్ నియంతృత్వ ధోరణిని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఉత్తరాఖండ్ వరదల్లో మన ప్రాంతానికి చెందిన భక్తులు చిక్కుకుపోతే కెసిఆర్ స్పందించలేదని, ఈ విషయమై అడిగేందుకు తాను వెళ్తే తనను అనుమతించలేదని మండిపడ్డారు. ఇంటి ముందుకు వస్తే కనీసం స్పందించక పోవడం దారుణమన్నారు.
సీట్లు, ఓట్లతో ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం రాజకీయ పార్టీని స్థాపించిన కెసిఆర్ పదమూడేళ్లుగా తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ యాత్రికులకు న్యాయం చేయని కెసిఆర్ ఇంకెవరికి చేస్తారన్నారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా తెలంగాణ మాదిగ దండోరా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడతామని చింతా స్వామి అన్నారు.
దొంగల పార్టీ: మోత్కుపల్లి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దొంగల పార్టీ, దోపిడీ పార్టీ, జైలు పార్టీ అని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా అన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెసు, తెరాస రెండు మోసం చేస్తున్నాయన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణనే తమకు కావాలన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ పైన ప్రజలకు నమ్మకం పోయిందని వరంగల్‌లో ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.












Click it and Unblock the Notifications