రాయల తెలంగాణ: చర్చిస్తామని కెకె, నో అని కెసిఆర్

రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని, ఎవరు ఆట ఆడినా గోల్ చేసిన వారికే క్రెడిట్ దక్కుతుందని చెప్పారు. తెలంగాణ ఇస్తే ఈ సూత్రం కాంగ్రెస్‌కు వర్తిస్తుందా? అని ప్రశ్నించగా.. అప్పుడది తెలంగాణ ప్రజల గెలుపు అవుతుందని బదులిచ్చారు. కాంగ్రెస్ నుంచి వలసలను, ప్రజల పోరాడే శక్తిని బలహీనపర్చే కుట్రే తెలంగాణ సాధన సభ అని ఆరోపించారు. వారంలో తెలంగాణ ఇప్పించాలని, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ నేతలను గ్రామాలకు రానిచ్చిది లేదన్నారు. ఆ సభ ఓ కుట్ర అన్నారు.
వ్యతిరేకిద్దాం: కెసిఆర్
విభజనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎలా వ్యవహరించాలనే విషయమై తెరాస చర్చిస్తోంది. సోమవారం పార్టీ అధ్యక్షుడు సీనియర్ నేతలతో చర్చించారు. అనంతపురం, కర్నూల జిల్లాలను కలిపితే ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ అంశాన్ని తేల్చాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా కనబడుతోందని, అయితే, రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటనను చేసి తప్పించుకునే అవకాశం కూడా ఉందని, కాంగ్రెసు పార్టీని నమ్మలేమని కెసిఆర్ అన్నారట.
హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇస్తే సరే అని, అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపిన రాయల తెలంగాణ ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించవద్దని, ఆ ప్రతిపాదనను వ్యతిరేకిద్దామని నేతలకు సూచించారట. రెండు జిల్లాలను కలిపి ఇస్తే.. కాశ్మీరు సమస్యలాగే తయారవుతుందని పలువురు నేతలు కూడా అన్నారని సమాచారం. రాయల తెలంగాణ ఇస్తే ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే అంశంపై కూడా వారు చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications