విభజన: చంద్రబాబుపై లగడపాటి నింద, తీర్మానంతోనే...

Lagadapati Rajagopal and Chandra babu Naidu
న్యూఢిల్లీ: తెలంగాణ నిందను కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ పైన వేశారు. ఆయన మంగళవారం న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. టిడిపి నేతలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నందువల్ల, ఆ పార్టీ విభజనకు అనుకూలంగా లేఖను ఇచ్చినందువల్లనే కేంద్రం తెలంగాణ వైపు మొగ్గుతుందని ఆరోపించారు. టిడిపి ఇచ్చిన లేఖ వల్లే కేంద్రంపై విభజన కోసం ఒత్తిడి పెరిగిందన్నారు.

ఈ మధ్య కాలంలో తెలుగు తల్లిని బలిపీఠం ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెలుగు తల్లిని చీల్చుతుందా? లేక అలాగే ఉంచుతుందా? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నారు. ఇవాళో రేపో అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెట్టనున్నారని చెప్పారు. ఈ తీర్మానం తెలంగాణ పైన ఉంటుందా? లేక రాయల తెలంగాణ పైన ఉంటుందా? అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు.

తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు విభజన కోసం దేనికైనా సిద్ధమని అప్పుడు చెప్పారని, వారి గొంతును ఇప్పుడు నొక్కివేశారన్నారు. కాంగ్రెసు పార్టీ ఎంపీలు, నేతల్లో చాలామంది విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విభజన భారాన్ని కేంద్రంపై వేసిందన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమిస్తున్నాయని చెప్పారు. ఈ సమస్య పరిష్కారంపై అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నారు.

ఈ మూడేళ్లలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలని గతంలోనే చెప్పామని కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం వద్దన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెట్టినా వీగిపోవడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే సమయంలో తెలుగుదేశం పార్టీ మేల్కోవాలని కోరారు.

అసెంబ్లీలో తీర్మానం పెట్టే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మహిళా బిల్లు నిలిచిపోయినట్లుగా ఇది కూడా నిలిచిపోతుందన్నారు. అసెంబ్లీలో తీర్మానం పెడితే వీగిపోతుందన్నారు. స్థానిక ఎన్నికల తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టే అవకాశాలున్నాయన్నారు. విభజన కత్తి అందరి పైన వేలాడుతోందన్నారు. రాష్ట్రం విడిపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. ప్రజల అభిప్రాయాలు వెల్లడించేందుకు ఉద్యమాలు అవసరం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+