కావూరి ర్యాలీలో అపశ్రుతి: బాణసంచా పేలి ఒకరి మృతి

Kavuri Sambasiva Rao
విజయవాడ/ఏలూరు: కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. మంత్రివర్గంలో చోటు దక్కిన తర్వాత ఆయన తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు వెళ్తున్నారు. మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి భారీ ర్యాలీతో ఆయన ఏలూరుకు వెళ్తున్నారు.

ఈ సమయంలో ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణ సంచా పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా వచ్చిన అభిమానులు ర్యాలీగా వెళ్తుండగా.. బాణసంచాతో మరో ఆటో వెళ్తోంది. ఈ సమయంలో బాణసంచా పేలి నిప్పు రవ్వలు ఆటోలో పడ్డాయి. దీంతో ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

అడ్డుకున్న టిడిపి

గన్నవరం నుండి ఏలూరుకు వెళ్తున్న కావూరి కాన్వాయ్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. తెలంగాణ అంశంపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సీమాంధ్ర టిడిపి నేతలు ఆయనను హనుమాన్ జంక్షన్ వద్ద అఢ్డుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

కాగా కావూరి ఈ రోజు తొలుత హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుండి ర్యాలీగా ఏలూరుకు బయలుదేరారు. ఆయనకు విమానాశ్రయంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+