జగన్ బ్లూఫిల్మ్స్ చూడట్లేదు, లగ్జరీగా లేరు: విజయమ్మ

YS Vijayamma
అదిలాబాద్: తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలులో నీలి చిత్రాలు చూస్తున్నారని, డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం కొట్టిపారేశారు. ఓ వర్గం మీడియా జగన్ పైన దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. జగన్ జైలులో లగ్జరీ జీవితాన్ని గడపడం లేదని, ఇతర విఐపి ఖైదీల్లాగే ఉంటున్నాడన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు జగన్ పైన నిరాధార ఆరోపణలు చేస్తున్నాయన్నారు. చివరకు తనను, షర్మిలను, భారతిని కూడా వదిలిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు, టిడిపిలు కలిసి వైయస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలని కుట్ర చేస్తున్నాయన్నారు. అనవసర ఆరోపణలు చేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేసి కాంగ్రెసు, టిడిపిలకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలు వేసే ఓటే జగన్‌ను జైలు నుండి బయటకు తీసుకు వస్తుందన్నారు. జగన్‌ను నిర్దేషిగా నిరూపిస్తుందన్నారు. అధికార పక్షం ప్రజలపై రాయితీలు తగ్గించి పన్నులు, ఛార్జీల భారం మోపుతోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన టిడిపి కాంగ్రెసుతో కుమ్మక్కైందన్నారు.

కాంగ్రెస్, టిడిపిల దిగజారుడు రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ప్రజల ఆదరాభిమానాల వల్ల రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పార్టీ శ్రేణులు గట్టిగా కృషి చేసి ప్రతి గ్రామ పంచాయతీపై పార్టీ జెండా ఎగిరేలా పాటు పడాలని ఆమె పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+