తెలంగాణకు జైకొట్టిన దిగ్విజయ్, మరింత స్పష్టత

Digvijay Singh hot comments on Telangana
బెంగళూరు: కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ తెలంగాణ అంశాన్ని తేల్చేశారు. సోమవారం తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిలించిన దిగ్విజయ్ సింగ్ కర్నాటకలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై మరింత స్పష్టత ఇచ్చారు. తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు సూచనప్రాయంగా హైదరాబాదులో చెప్పిన దిగ్విజయ్ తెలంగాణ ఇవ్వబోతున్నట్లుగా దాదాపు స్పష్టత ఇచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ సమస్య ఉందని, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రంలో తమ విజయావకాశాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. తమ దృష్టి అంతా దక్షిణాది రాష్ట్రాల పైనే ఉందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో యాభై సీట్లు గెలువాలనేది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌ల పైననే తమ దృష్టి ఉందని చెప్పారు. తమ ఆశలు కూడా దక్షిణాది పైనే ఉన్నాయన్నారు. కర్నాటక లోకసభ ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళలోను తమకు అనుకూలంగా ఉందన్నారు. తమిళనాడులో పొత్తులకు ఇంకా సమయం ఉందని చెప్పారు.

తెలంగాణ విషయంలో రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పానని, ఒకటి విభజన, రెండు సమైక్యాంధ్ర అన్నారు. రోడ్డు మ్యాప్‌తో రావాలని రాష్ట్ర ముఖ్యనేతలకు చెప్పానని, ఆ నివేదికను అధిష్టానానికి ఇస్తామని చెప్పారు.

అధిష్టానం చేతుల్లో: శైలజానాథ్

తెలంగాణ అంశం అధిష్టానం చేతులలో ఉందని మంత్రి శైలజానాథ్ అనంతపురం జిల్లాలో అన్నారు. అనుకోని నిర్ణయం వస్తే అనంతపురం ఏడారి అవుతుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు.

కాగా రాష్ట్రం విడిపోతే ఎవరికీ నష్టం లేదని మంత్రి జానా రెడ్డి హైదరాబాదులో అన్నారు. విడిపోతే ఎవరికీ అవమానం జరగదన్నారు. తెలంగాణ సమస్య ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉందన్నారు. అధిష్టానం తెలంగాణ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+