నింగికెగసిన దిక్సూచి: పిఎస్ఎల్వీ సి22 విజయవంతం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో అంతరిక్ష పరిశోధకులు అవిశ్రాంతంగా పనిచేసి చోదక వ్యవస్థకు మార్గదర్శిగా ఉపయోగపడే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఈ తొలి ఉపగ్రహాన్ని (ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఏ) విజయవంతంగా ప్రయోగించారు. పిఎస్ఎల్వీ సి22 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని మోసుకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది.
శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా ఉప భూస్థిర కక్ష్యలోకి దాన్ని ప్రవేశపెట్టింది. దీంతో మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని నిర్వహిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్‌సహా శాస్త్రవేత్తల వదనాల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన దరహాసం చోటుచేసుకుంది. అందరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఇంతలో కర్ణాటకలోని ఇస్రోకు చెందిన హసన్ కేంద్రానికి ఉపగ్రహ సంకేతాలు కూడా అందడం.. ఆ విషయం మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరడంతో శాస్త్రవేత్తలు కరతాళ ధ్వనులు చేశారు. దేశంలో తొలి నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. మిషన్ డైరెక్టర్ డాక్టర్ సురేష్‌తోపాటు ఈ ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందించారు. 44 మీటర్ల ఎత్తున్న ఈ ఉపగ్రహం పదేళ్లపాటు పని చేస్తుంది. ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ప్రయోగానికి అయిన ఖర్చు రూ.1,600 కోట్లు.












Click it and Unblock the Notifications