అపరిచితుడి ఫోన్ కాల్: రూ.2,500 కోట్లు పట్టివేత
ముంబై: ఆదాయ పన్ను శాఖ, జాతీయ విచారణ సంస్థలు ఉమ్మడిగా దాడులు చేసి రూ.2,500 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుండి అహ్మదాబాద్‌కు పెద్ద ఎత్తున డబ్బులు, బంగారం, వజ్రాలు వెళ్తున్నాయనే సమాచారం తెలుసుకున్న ఇన్‌కమ్ టాక్స్ డిపార్టుమెంట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు సోమవారం అర్ధరాత్రి ఈ భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
వారం రోజుల క్రితం ఓ అగంతకుడు ఫోన్ చేసి భారీగా డబ్బులు, బంగారం, వజ్రాలు గుజరాత్ తరలిస్తున్నారని చెప్పారు. దీంతో అఫ్రమత్తమైన ఐటి, ఎన్ఐఏ సంస్థలు వారం రోజులుగా నిఘా పెట్టింది. సోమవారం అర్ధరాత్రి గుజరాత్ మెయిల్‌లో ఈ మొత్తాన్ని తరలించేందుకు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారు. వారు 47 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వారు స్వాధీనం చేసుకున్న వాటిలో డబ్బు, బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని నాలుగు ట్రక్కులలో, 150 పెద్ద బ్యాగులలో తీసుకు వచ్చారు. పట్టుకన్న డబ్బును సింధియా హౌస్‌కు తరలించారు. రాత్రి నుండి వాటి లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం రూ.2500 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటంతో ఉగ్రవాద కోణంలోను పరిశీలిస్తున్నారు. ఈ సొమ్ము ఎవరిది, ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు తరలిస్తున్నారు అనే కోణంలో విచారణాధికారులు సమాచారం సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications