శాడిస్ట్: లగడపాటిపై హరీష్, రమ్య ఫంక్షన్ హాల్‌పై దాడి

Harish Rao
హైదరాబాద్/కరీంనగర్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు బుధవారం అన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా తెరాస ఎత్తిన జెండా దించదని చెప్పారు.

తెలంగాణ వస్తుందనే ప్రచారం సాగుతుందని, అదే సమయంలో రాష్ట్ర విభజనను అడ్డుకునే కుట్రను సీమాంధ్ర నేతలు చేస్తున్నారన్నారు. లగడపాటి వంటి నేతలు సమైక్యాంధ్ర అంటూ గళమెత్తారన్నారు. లగడపాటి మూర్ఖత్వంతో, శాడిస్ట్ మెంటాలిటీతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయనది గుడ్డి వ్యతిరేకత అన్నారు. తెలంగాణ ఇక ఎవరు ఆపినా ఆగదన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణను ఇప్పుడు ఇవ్వాలని లేదంటే 2014 ఎన్నికల తర్వాత ప్రజలే సాధించుకుంటారన్నారు.

పొట్టకూటికోసం వచ్చిన వాళ్లకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఎవరి బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు తెలంగాణ ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమేనని సభ ఏర్పాటు చేశారని, వారు ఆ సభకు సార్థకత తీసుకు రావాలన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఇస్తే స్వాగతిస్తామని లేదంటే కాంగ్రెసుకు నూకలు చెల్లినట్లే అన్నారు.

టిఆర్ఎల్డీ మహిళా నేత ఇంటిపై దాడి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోదరుని కూతురు, టిఆర్ఎల్డీ నేత రమ్య ఫంక్షన్ హాల్ పైన తెలంగాణవాదులు బుధవారం దాడి చేశారు. కెసిఆర్ పైన ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని, దానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+