ఉస్మానియా గురువు: 16 మంది అమ్మాయిలకు వల

OU assistant prof. held for sex abuse
హైదరాబాద్: ఒకరికి తెలియకుండా మరొకరిని నమ్మిస్తూ 16 మంది అమ్మాయిలకు వల వేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసు శివశంకర్ అనే ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పానగల్ మండలం కేటేపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ)లో చురుగ్గా పనిచేసేవాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. తర్వాత ఓయూ టెక్నాలజీ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా చేరాడు.

పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేయిస్తానని కొందరిని, పరీక్షల్లో పాస్ చేయిస్తానని ఇంకొందరిని అమ్మాయిలను వలలో వేసుకోవడం మొదలుపెట్టాడు. ఓయూలో సుమారు ఐదారేళ్లుగా ఇదే పనిచేస్తున్నాడు. సామాజిక కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనల పేరుతో ఒక్కోసారి ఒక్కో అమ్మాయిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. ఏవేవో మాటలు చెప్పి నెమ్మదిగా ప్రేమలో పడేసేవాడు. ఒకరి విషయం మరొకరికి తెలియకుండా 16 మందిని తన ప్రేమవలలో బంధించాడు. ఒకరంటే ఒకరికి పడకుండా చాడీలు చెప్పి వివాదాలు పెట్టేవాడు.

ఒకరోజు అతని అసలు బాగోతం అమ్మాయిలకు తెలిసిపోయింది. అతడిని నిలదీశారు. ఫిర్యాదు చేస్తామని వారంటే.. తనతో సాగించిన లీలలు బయట పెడతానని బెదిరించేవాడు. దీంతో అమ్మాయిలు వెనక్కి తగ్గారు. చివరకు.. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్న నిశ్చయానికొచ్చి సామాజిక కార్యకర్తలు దేవి, పద్మలను సంప్రదించి విషయం వివరించారు. వారు ఓయూ వీసీ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.

దీంతో లైంగిక వేధింపులపై నియమించిన కమిటీతోపాటు, మరో కమిటీతో ఆయన విచారణ చేయించగా, శివశంకర్ రాసలీలలు నిజమేనని తేలింది. దీనిపై వీసీ ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటుపైన అరెస్టయి జైలుకెళ్లిన శివశంకర్ బెయిల్ పొంది, మళ్లీ కళాశాలకు వస్తూ తనపై ఫిర్యాదు చేసిన అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో సామాజిక కార్యకర్తలు నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి పరిస్థితి వివరించారు.

అలాగే ఫిర్యాదు ఉపసంహరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో ఓ అమ్మాయి సీసీఎస్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివశంకర్ ఆగడాలు మితిమీరడంతో చివరకు ఓయూ అధికారులు అతడిని విధులనుంచి తొలగించారు. అప్పటినుంచి పరారీలో ఉన్న అతడిని పోలీసులు రెండురోజుల క్రితం అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+