జగన్ డిఎన్ఏ, లిమిటెడ్ కంపెనీ: డిగ్గీకి షర్మిల కౌంటర్

దీనిపై షర్మిల ప్రజా ప్రస్థానంలో స్పందించారు. జగన్‌ది కాంగ్రెసు డిఎన్ఏ కానే కాదని, ఆ మాట అనడానికి సిగ్గుపడాలన్నారు. కాంగ్రెసు డిఎన్ఏ పేరు వెన్నుపోటు అని, తమది మాత్రం విశ్వసనీయత అన్నారు. జగన్ పార్టీది ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ అన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికీ ఆమె కౌంటర్ ఇఛ్చారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీది ఏ లిమిటెడ్ కంపెనీయో చెప్పాలన్నారు. చంద్రబాబు మైనార్టీ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారని ఆరోపించారు.
దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ కరెంటు బాదుడుకు వ్యతిరేకంగా అనేక ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే విచిత్రంగా చంద్రబాబు రెండు చేతులు అడ్డం పెట్టి సర్కారును కాపాడారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని కత్తులు, గొడ్డళ్లతో చంపేయాలన్న బాబు అవిశ్వాసె పెట్టేసరికి రంగులు మార్చారని, అలాంటి వ్యక్తిని నాయకుడు అంటారా? లేక ఊసరవెల్లి అంటారా? అని ఎద్దేవా చేశారు.
మంగళవారం 197వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని అయ్యన్నపాలెం నుంచి ప్రారంభమయ్యింది. గుల్లెపల్లి, పెదనాయుడిపాలెం మీదుగా సబ్బవరం చేరుకుంది. అక్కడినుంచి అసకపల్లి మీదుగా రాత్రి 8 గంటల సమయంలో పైడివాడ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. మొత్తం 15.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2622.1 కి.మీ యాత్ర పూర్తయ్యింది.












Click it and Unblock the Notifications