చివర్లో వచ్చి కాంగ్రెస్ ఫోజులు: కెటిఆర్, మేం సిద్ధం: రోజా

తెలంగాణపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే వరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెసును, యూపిఏ ప్రభుత్వాన్ని నమ్మవద్దన్నారు. తమకు హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలన్నారు. నాడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకోవాలన్నారు. టిఆర్ఎస్ పదమూడేళ్లుగా తెలంగాణ కోసం పోరాడి, ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా తీసుకు వెళ్తే, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు చివరలో వచ్చి ఎగిరిపడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలలోపు తెలంగాణను ప్రకటిస్తే కాంగ్రెసుకే మద్దతివ్వాలని ప్రజలకు సూచిస్తామన్నారు.
తెలంగాణ రాకుంటే కాంగ్రెసులో ఉండను: కోమటిరెడ్డి
వచ్చే ఎన్నికలలోపు కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే తాను ఆ పార్టీలో ఉండనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే ఎవరు అడ్డుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
కుట్రలు ఎదుర్కొనేందుకు సిద్ధం: రోజా
పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ కుట్రలు చేసి గెలుపొందేందుకు సిద్ధపడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా ఆరోపించారు. గతంలో సహకార ఎన్నికలలో అధికార పార్టీ జిమ్మిక్కులు చేసి గెలుపొందిందన్నారు. ఇప్పుడు కూడా రిజర్వేషన్లు తదితరాల పేరుతో లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. అధికార పార్టీ కుట్రలు ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications