షర్మిల తెల్సుకో: విహెచ్ నిప్పులు, టిఆర్ఎస్ విలీనంపై....

కాంగ్రెసు పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీలో విలీనమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే వచ్చే ఎన్నికలలో ఇరు ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీయే విజయం సాధిస్తుందన్నారు. తెలంగాణలో పదిహేను పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుందన్నారు.
చిత్తశుద్ధి గెలిపిస్తుంది: శ్రీధర్ బాబు
పంచాయతీ ఎన్నికలలో తమ పార్టీదే విజయమని మంత్రి శ్రీధర్ బాబు వేరుగా అన్నారు. సంక్షేమ పథకాలపై, తెలంగాణపై తమ పార్టీ చిత్తశుద్ధే విజయాన్ని సాధించి పెడుతుందన్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో 81 మంది ఆచూకీ లభించడం లేదన్నారు. గల్ఫ్‌లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను రప్పిస్తామన్నారు.
ముడుపుల కోసమే దిగ్విజయ్: టిడిపి
కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ముడుపుల కోసమే రాష్ట్రానికి వచ్చారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. నాడు ఢిల్లీకి మూటలు ఎత్తుకు వెళ్లిన దిగ్విజయ్ మళ్లీ వచ్చారని మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడానికి వైయస్ కారణమని విజయమ్మ గుర్తించాలన్నారు. పంచాయతీ ఎన్నికలే కాంగ్రెసును ఓడించేందుకు తొలిమెట్టని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications