ఎమ్మెల్యేపై ఆకులపై కేసు, గల్లా ఫుడ్స్‌లో ప్రమాదం

Akula Rajender
నల్గొండ/హైదరాబాద్/కరీంనగర్: హైదరాబాదులోని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పైన కేసు నమోదయింది. భూవివాదం నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

ప్రేమ జంట ఆత్మహత్య

నల్గొండ జిల్లాలో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని దామరచర్లలో కృష్ణం రాజు, మల్లేశ్వరిలు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కృష్ణం రాజుకు పెద్దలు మరో యువతితో పెళ్లి జరిపించారు. ఆ పెళ్లి ఇష్టం లేని కృష్ణం రాజు కొద్ది రోజుల క్రితం మల్లేశ్వరితో కలిసి అదృశ్యమయ్యాడు. భార్య తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలో ప్రశాంత్ అనే పదవ తరగతి విద్యార్థి దొంగతనం కేసు నమోదు చేస్తారనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత్ పదో తరగతి పూర్తి చేశాడు. అతను తన సర్టిఫికెట్స్ తీసుకోవడానికి పాఠశాలకు వెళ్లాడు. ఆ రోజు నుండే ప్రిన్సిపల్ సెల్ ఫోన్ కనిపించకుండా పోయింది. దీంతో ప్రిన్సిపల్ ప్రశాంత్‌ను బెదిరించాడు. దీంతో మనస్థాపం చెందిన ప్రశాంత్ బుధవారం మధ్యాహ్నం పోలీసు కేసు వేస్తారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా లేఖ రాసి పురుగుల మందు తాగాడు.

గల్లా ఫుడ్స్‌లో అగ్ని ప్రమాదం

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట వద్ద ఉన్న గల్లా ఫుడ్స్ పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడు వందల టన్నుల మామిడి తాండ్ర దగ్ధమైంది. ఒకటిన్నర కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా భావిస్తున్నారు.

గుడిసెలు దగ్ధం

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ సీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ి ఆక్రమించుకొని ఏర్పాటు చేసిన వంద పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+